1067

12 లక్షలు విలువచేసే మోటార్ వాహనాలు స్వాధీనం వ్యక్తి అరెస్టు

అనంతపురం
కదిరి : కదిరి మండల పరిధిలోని కుమ్మరి వారి పల్లి వద్ద శుక్రవారం షేక్ నూర్ మహమ్మద్ అనే యువకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 18 చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డి.ఎస్.పి భవ్య కిషోర్ కదిరి రూరల్ శ్రీ ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు

శుక్రవారం కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు

హిందూపురానికి చెందిన మొహమ్మద్ గత కొంత కాలంగా కదిరి రూరల్ పరిధిలోని కుమ్మర వాండ్ల పల్లి లో నివాసముంటూ మరో ఇద్దరి యువకులను జత చేసుకుని అనంతపురం గోరంట్ల ధర్మవరం అదే విధంగా కడప జిల్లా గాలివీడు తదితర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలించి అమ్ముకునేవాడు

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి గిన నిఘా పెట్టి చర్యలు చేపట్టాలని సూచించారు

ఇందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా కదిరి రూరల్ పరిధిలోని కుమార్ వాళ్ళ పల్లి వద్ద అనుమానంతో షేక్ నూర్ మొహమ్మద్ అనే యువకుని అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం 18 వాహనాలను చోరీ చేసినట్లు తెలిపాడు

వీటి విలువ 12 లక్షల వరకు ఉంటుంది కాగా ఈ కేసులో కదిరి రూరల్ స్టేషన్ సిఐ నిరంజన్ రెడ్డి ఆయన సిబ్బంది చూపిన చదువు పట్ల జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అదేవిధంగా కదిరి డి.ఎస్.పి కిషోర్ అభినందన వ్యక్తం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here