అనంతపురం జిల్లా లో డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్

14

జిల్లా కేంద్రంలో డిశంబర్ 31 న ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాం

  • జిల్లా కేంద్రంలో 300 మంది పోలీసులతో బందోబస్తు
  • డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ … ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు
  • పిల్లలను బయటికి పంపేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి

— అనంతపురంఅడీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి

అనంతపురం జిల్లా కేంద్రంలో డిశంబర్ 31 న ఎలాంటి ఘటనలు జరుగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టామని అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్ణీత సమయంలోనే డాబాలు, బార్లు, హోటల్‌లు మూసివేయాలన్నారు. మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంలో ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బందిపెట్టినా అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. వీటితోపాటు త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ రోజు ఇంటి నుండీ బయటికెళ్లే ముందు పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. అనంతపురం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో అందరూ సహకరించాలని ఆయన కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here