అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభం

83
  • పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శన … ప్రజలకు అవగాహన అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచి ప్రజలకు అవగాహన చేశారు. ప్రతీ ఏటా అమర పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలులో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కోదండ రామాలయం కళ్యాణ మండపంలో పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షుతులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన ప్రజలకు ఆయుధాల గురించి అవగాహన చేశారు. సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి ఈసందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

** ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు…. .22 రైఫిల్ , .410 మస్కెట్ , .303 రైఫిల్ , 762 ఎం.ఎం SLR, ఏ.కే 47, 5.56 ఎం.ఎం (ఇన్సాస్ ), 12 బోర్ పంప్ యాక్సన్ గన్ , 9 ఎం.ఎం. కార్బైన్ , .380 రివాల్వర్ , 9 ఎం.ఎం ఫిస్టోల్ , 9 ఎం.ఎం గ్లాక్ , వి.ఎల్ ఫిస్టోల్ , ప్రొజెక్టర్ ఫైరోటెక్ , 12 బోర్ పంప్ యాక్సన్ గన్ , ఎల్ .ఎం.జి, 51 ఎం.ఎం మోటారు, హెచ్ .ఇ 36 గ్రనేడ్ , యాంటీ రైట్ గన్స్ , గ్యాస్ గన్ , రోబోటెక్ ( బాడీ ప్రొటెక్టర్ ) , సేవాదళ్ డ్రస్ , ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్ , స్టోన్ గార్డు, హెల్మెట్ , కేన్ లాఠీ, బుల్లెట్ ప్రూప్ జాకెట్ హెవీ, మీడియం, లైట్ ... డే మరియు నైట్ విజన్ బైనాక్యూలర్లు, జి.పి.ఎస్ , మెగాఫోన్ , లెటర్ బాంబు డిటెక్టర్ , ప్యాకెట్ స్కానర్ , డి.ఎస్ .ఎం.డి, HHMD, NLJD, నార్కో డిటెక్సన్ కిట్ , పాలిరే యు.వి.లైట్ , క్లూస్ టీం, డస్ట్ ఫుట్ ప్రింట్ లిఫ్టర్ , LHMS, బాడీవోన్ కెమేరాలు, ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం) , డ్రోన్ కెమేరాలు, డి.ఎఫ్ .ఐ.డి, బాంబు రింగ్ మరియు డాగ్ బృందాలను ప్రదర్శనలో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here