Yuగంప మల్లయ్య స్వామి కొండమీద పూజారి అప్పా పాపయ్య స్వామివారికి కొండ చివర భాగన నిలబడి ప్రత్యేక పూజలు చేశారు. ఆ కొండ చుట్టు పక్కల ప్రాంతానికి భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. కొండ చివర నిలబడి స్వామివారిని ప్రార్థించారు. సంప్రదాయ వాయిద్యాల శబ్దాల నడుమ పూజారి నృత్యం చేశారు.
వెయ్యి అడుగుల పైన ఉండే కొండ మీద నుండి కిందకు ఓ యాభై అడుగుల దాకా బాగా నూనె తో నిండి ఉన్న కొండ వాలు గుహలో ఉన్న దేవుడికి నైవేద్యం పెట్టి, ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి ఎక్కడం జరుగుతూ ఉంటుంది.
అయితే దురదృష్టవశాత్తు నేడు పూజలో పొరపాటున కాలుజారి కొండపై నుంచి దొర్లుతూ వెయ్యి అడుగుల కిందకు లోయలో పూజారి పడిపోయాడు.
కొండపైన ఉన్న భక్తులందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగింది. వెంటనే భక్తులు కొండ కిందకు వెళ్లి చూశారు.. కానీ అప్పటికే పూజారి పాపయ్య చనిపోయారు. భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసంప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలయ పూజారి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
చాలా విషాదకరం.దేవుడి మీద భక్తి ఉండాలి.కానీ…