చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి… ఎందుకో తెలుసా? ..

వారానికొకసారైనా.. 1కి.మీ ., చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి…
ఎందుకో తెలుసా? ..
ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఉదయం మంచం మీద నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకూ కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు..
వీలైతే స్లిప్పర్లు, శాండిల్స్…స్పోర్ట్స్ షూస్..ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఒక పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి…

ఎందుకు? ఏమిటి? ఎలా అనే ప్రశ్నలు మీరు వేస్తే ….
ఇదిగో వాటికి సమాధానం:

శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది.
రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది…
నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా…ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా….. మీ బి.పి కంట్రోల్ అవుతుంది..
అలా కొత్త స్పర్శను, పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.సహనం పెరుగుతుంది…
మానవుని పాదాల్లో 72వేల నరాలకొనలు ఉంటాయి.. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి ఉత్సాహంగా ఉంటాయి..

కాబట్టి..ఇక మీదట..
పార్క్ లలో, బీచ్ లలో, ఆఫీసులలో, ఇళ్ళల్లో….చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి..
_ఆరోగ్యంగా ఉండండి

Share.