భీష్మ మూవీ రివ్యూ

భీష్మ మూవీ రివ్యూ
‘భీష్మ’. అఆ.. సూపర్ హిట్ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసిన నితిన్.. అవేమీ వర్కవుట్ అవ్వకపోవడంతో తనకు అలవాటైన రొమాంటిక్ కామెడీనే మళ్లీ ఎంచుకుని.. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన వెంకీ కుడుమల తో కలిసి ”భీష్మ”గా ప్రేక్షకులను పలకరించాడు. టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న భీష్మ.. సినిమాతో కూడా అలరించాడా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

డిగ్రీ కూడా పాసవ్వని భీష్మ (నితిన్) కు ఏ ఒక్క అమ్మాయి పడదు. అలాంటి భీష్మ నితిన్(రష్మిక) ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత రష్మిక కూడా ప్రేమించడం,వారి ప్రేమ కొనసాగుతుండగా.. వారి ప్రేమ గురించి తెలుసుకున్న చైత్ర తండ్రి తన కూతురు రేంజ్ కి భీష్మ స్థాయి అసలు సరిపోదని చెప్తాడు. ఆ టైం లో అన్నిరోజుల వరకు భీష్మకి కూడా తెలియని నిజం తనకు తెలియడం, అనుకోకుండా భీష్మ ఆర్గానిక్స్ కు భీష్మ సీఈఓ అవడం.. ఆ తర్వాత సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేసే నితిన్ కు, క్రుత్రిమ రసాయనాలతో పంటను త్వరగా పండించాలని చూసే విలన్ మధ్య వార్ జరుగుతుంది. చివరకు వారి యుద్ధం ఎలా ముగిసింది? భీష్మ, చైత్రల ప్రేమ కథ చివరకు ఎలా పెళ్లి పట్టాలెక్కిందన్నదే కథ.

నితిన్ తనకు బాగా అలవాటైన జోనర్ కాబట్టి.. చాలా యాక్టివ్ గా కనిపిస్తూ చెలరేగిపోయాడు. తన గత సినిమాలతో పోలిస్తే భీష్మలో చాలా ఫ్రెష్ లుక్ లో ఉన్నాడు. నటన పరంగానూ చాలా డెవలప్ మెంట్ కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్, డ్యాన్సులు ప్రతీ ఒక్కరినీ అలరిస్తాయి. రష్మిక తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఒక పక్క చీరకట్టులో ట్రెడిషనల్ గా అలరిస్తూనే.. మరోవైపు క్యూట్ గా గ్లామరస్ గా ఎంటర్టైన్ చేసింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు చాలా పెద్ద ఎస్సెట్. ఇద్దరి మధ్య వచ్చే లవ్ సీన్లు కూడా బాగా పేలాయి.

కన్నడ సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ తన నటనా అనుభవాన్ని మరోసారి చూపించాడు.. అశ్వథ్థామ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జిషు సేన్ గుప్తాలు కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కవుట్ అయింది. సంపత్ తో వచ్చే వీడియో కాల్ సీన్, తాగి మీమ్స్ చెప్పే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. హెబ్బా పటేల్ తన పాత్ర తను చేసుకుని వెళ్లిపోయింది తప్పించి.. సినిమా వల్ల తనకు కానీ, తన వల్ల సినిమాకి కానీ ఒరిగిందేమీ లేదు. నరేష్, బ్రహ్మాజీ,రఘుబాబు.. మిగిలిన వారు వారి వారి పరిధుల్లో చేశారు.

తన మొదటి సినిమా ‘ఛలో’ తోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈసారి తన సినిమాకు భీష్మ అని పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నా.. దానికి సింగిల్ ఫరెవర్ అనే క్యాప్షన్ పెట్టి ట్రెండీ టచ్ ఇచ్చాడు. అలాగని భారీ డైలాగులు చెప్పి ప్రేక్షకుడిని విసిగించలేదు. అందరూ కడుపునిండా నవ్వుకునేలా కామెడీని జోడించి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు ఒక మామూలు కథను తీసుకుని దానికి ప్రస్తుత తరానికి బాగా అవసరమైన సేంద్రీయ వ్యవసాయం అనే స్ట్రాంగ్ పాయింట్ ను టచ్ చేస్తూ దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. 30 రోజుల్లో కంపెనీ సీఈఓగా నిలబడటానికి జస్ట్ టైం కలిసొస్తే చాలు అని సింపుల్ గా చెప్పేశాడు. ప్రపంచంలో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ అదృష్టవంతుడితో పెట్టుకోకూడదని లాజికల్ గా చెప్పాడు. ఒకవైపు కామెడీని పంచుతూ, మరోవైపు లవ్ ట్రాక్ ను నడిపిస్తూ.. ఇంకోవైపు మెసేజ్ ఇవ్వడం అన్నింటినీ ఒకతాటిపై నడపడంలో వెంకీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది. అందమైన ప్రదేశాలన్నింటినీ తన కెమెరాతో బంధించి చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు. మహతి స్వర సాగర్ పాటలు బాగున్నాయి. తెర మీద అవి ఇంకా బాగా, రిచ్ గా ఉన్నాయి. రీరికార్డింగ్ చక్కగా కుదిరింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.

ప్లస్‌ పాయింట్స్‌:

సినిమాటోగ్రఫీ
హీరోహీరోయిన్ల సీన్స్‌

అనంత్ నాగ్ నటనా

మైనస్‌ పాయింట్స్‌:

పాటలు
సాగదీత, బోరింగ్‌ సీన్లు

ఫిల్మ్ జల్సా రేటింగ్:3/5

Share.