ఫిబ్రవరి లో బాలయ్య –బోయపాటి చిత్రం ప్రారంభం

69

నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం వచ్చేనెల ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు బోయపాటి శ్రీను – బాలకృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ బ్లాక్ బస్టర్ లు కావడంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . సింహా , లెజెండ్ చిత్రాల్లో బాలయ్య ని అభిమానులు బాలయ్య ని ఎలా చూడాలని ఆశిస్తున్నారో అలా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి కాగా ఇప్పుడు రాబోయే సినిమాలో బాలయ్య ని ఎలా చూపించనున్నాడో అన్న ఆసక్తి నెలకొంది .

ఈ నెలలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం 95 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్య – బోయపాటి కలిస్తే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే అని అంటున్నారు నందమూరి అభిమానులు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here