గంగూబాయ్ ట్రైలర్ వచ్చేసింది.. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం!

568

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌ని విడుదల చేసి మేకర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు.

ఈ సినిమాలో అలియా భట్‌తో పాటు అజయ్ దేవగన్ కూడా కనిపించబోతున్నాడు. ముంబై డాన్ కరీం లాలా పాత్రలో అజయ్ దేవగన్ నటించగా.. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదల అవుతోంది. హుస్సేన్ జైదీ రచించిన “Mafia Queens Of Mumbai: Stories Of Women From The Ganglands” పుస్తకంలోని గంగూబాయి కతియావాడి కథాంశాన్ని తీసుకుని బన్సాలీ సినిమాని రూపొందించాడు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో కెరీర్ ప్రారంభించిన అలియా భట్.. హైవే, ఉడ్తా పంజాబ్ వంటి ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో ఆర్ఆర్ఆర్‌లో మెయిన్ లీడ్‌గా చేస్తుండగా.. గంగూబాయి కతియావాడి సినిమా ట్రైలర్‌లో మాత్రం తన నట విశ్వరూపం చూపించింది. ఈ సినిమాలో అలియా భట్ గంగూబాయి పాత్రలో కనిపించగా.. అలియా కెరీర్‌లో ఇది డిఫరెంట్ క్యారెక్టర్‌.. ఈ సినిమా కొత్త అధ్యాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
సంజయ్ లీలా బన్సాలీ ప్రతి సినిమాలాగే ఈ సినిమా కూడా బాలీవుడ్ సినిమా సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గానే ఉంది. వేశ్యా సామ్రాజ్యానికి అధినేత్రిగా ఉన్న గంగూబాయి కథాంశం.. స్త్రీ శక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని బన్సాలీ – జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మించారు.
“కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే” ఎందుకంటే అక్కడ గంగూబాయ్‌ ఉంటుంది. అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. కారులో ఆలియా భట్‌ ఎంట్రీ ఇస్తుండగా.. ‘మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ ప్రతిరోజూ రాత్రి మేం ఇజ్జత్ అమ్ముతాం’, ‘కామాఠిపుర రజియా భాయ్ సొంతం’, ‘రజియా భాయ్ పేరు చెపితే వాంతులు వస్తున్నాయి’. అంటూ కొన్ని డైలాగ్స్ ఇందులో హైలెట్‌గా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here