అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ

RRR మూవీ కథను రివిల్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. కథను వివరించారు. 1920 కథకు సంబంధించినది. పిక్షన్ స్టోరీని రియల్ క్యారెక్టర్లతో తీస్తున్నట్లు వెల్లడించారాయన. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలను కలిపి ఈ స్టోరీ తయారు చేసినట్లు వెల్లడించారు.

ఈ విప్లవకారులు యుక్త వయస్సులో ఉన్నప్పటి కథ అన్నారు. అల్లూరి, కొమరం ఇద్దరూ యుక్తవయస్సులో ఉన్నప్పుడు కొన్నాళ్లు ఉత్తరభారతం వెళ్లారని.. తిరిగి జ్ణానంతో వచ్చారన్నారు. ఈ కథాంశాన్ని తీసుకుని సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు.

స్వాతంత్ర సమరంకు ముందు అల్లూరి సీతారామరాజు.. ఉత్తర తెలంగాణ పోరాటవీరుడు కొమరం భీం ఒకే టైమ్‌లో పుట్టారని, అయితే ఇద్దరు కొన్నేళ్లపాటు కనిపించలేదని, అయితే అప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అనే విషయాన్ని లైన్‌గా తీసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. RRR సినిమాలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌చరణ్.. కొమరం భీమ్‌‌గా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు.

RRR మూవీని అల్లూరి, కొమరం భీం లింక్ చేస్తూ తీస్తున్నట్లు స్పష్టం చేసేశారు. ఇందులో అల్లూరిగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరితోపాటు భారీ స్థాయిలో తారగణం ఉన్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు తెలిపారు.

అజయ్ దేవగన్ ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రామ్‌చరణ్ పక్కన ఇందులో ఆలియా భట్ నటిస్తుందని, ఎన్టీఆర్ పక్కన జంటగా.. డైజీ అనే విదేశీ యువతి నటిస్తునట్లు చెప్పారు. సముద్రఖని కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో సినిమాకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌లను సినిమా నిర్మాత డీవీవీ దానయ్య తెలియజేశారు. ఈ సినిమాను జులై 30, 2020న విడుదల చేస్తున్నామని, అలాగే సినిమా బడ్జెట్ రూ.350కోట్లు.. నుండి రూ.400కోట్లు వరకు అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. బాహుబలి తర్వాత అంత పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న తెలుగు సినిమా ఇదే అని అంటున్నారు. ఇక ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రతీ లాంగ్వేజ్‌లో సినిమాకు ఒక్కొక్క టైటిల్ పెడుతున్నామని, అయితే అన్నింటినీ #RRR వచ్చేలా పెడుతామని తెలిపారు.

Share.