బాలకృష్ణ ‘రూలర్’ టీజర్

నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘రూలర్’ సినిమా అప్‌డేట్ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఎట్టకేలకు నవంబర్ 21 సాయంత్రం వారి నిరీక్షణ ఫలించింది.. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో   హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న NBK 105 ‘రూలర్’ టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.

‘‘ధర్మ.. మా ఊరికే గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టమొచ్చినా తనే ముందుంటాడు’’ అంటూ ధర్మ క్యారెక్టర్ గురించి చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో బాలయ్య అదరగొట్టేశాడు.. ‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను.. యూనిఫామ్ తీశానా బయటికి వచ్చిన సింహంలా ఆగను…. ఇక వేటే.. అంటూ బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.

బాలయ్య మార్క్ డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్ ద్వారా హింట్ ఇచ్చింది మూవీ టీమ్. మాస్, క్లాస్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలగలిపిన ఫుల్ మీల్స్‌లా ఉంది టీజర్ అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.. విజువల్స్, ఆర్ఆర్ బాగా సెట్ అయ్యాయి. వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ, రఘుబాబు, సప్తగిరి, ధనరాజ్ తదితరులు నటించిన ‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, నిర్మాత : సి.కళ్యాణ్.

Share.