‘సాహో’ రివ్యూ!

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తరువాత దానికి నిలబెట్టుకునేలా బాహుబలి-2 సినిమాతో వచ్చేసాడు. ఇక ఇప్పుడు 350 కోట్ల ఖర్చుతో వచ్చిన సాహో సినిమాకి ఎంతటి హైప్ ఉండాలో అంతటి హైప్ సాధించుకుని దాన్ని ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా నిలబెట్టుకుంటూ వచ్చారు. అంతేకాదు అసలు ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ ప్రభాస్ ఎలా షో కేస్ చేస్తాడా అన్న ప్రశ్నలకు ట్రైలర్ క్లియర్ ఆన్సర్ ఇవ్వడంతో ఇక ఎవ్వరికి ఏ ప్రశ్నలు మిగలలేదు. అలా మొదలయిన దగ్గరినుండి ఇప్పటివరకు క్రమక్రమంగా క్రేజ్ పెంచుకుంటూ ఇప్పుడు సునామీలాంటి హైప్ తో వేల థియేటర్స్ లో గ్రాండ్ గా ఇవాళ(ఆగస్టు-30,2019) రిలీజ్ అయ్యింది సాహో. మరి పేరుకు తగ్గట్టు ఈ సినిమా సాహో అనిపించుకుందా? ప్రభాస్ కి బాహుబలి అందించిన ఇంటర్నేషనల్ ఇమేజ్ ని నిలబెట్టిందా? టాలీవుడ్ కి మరొక ప్రౌడ్ ఫిల్మ్ గా నిలిచింది లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉండే వాజీ సిటీలో.. ఓ మాఫీయా ముఠాకు లీడర్ అయిన రాయ్.. ఓ గ్రూప్ ను ఫామ్ చేసి, అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసిస్తుంటాడు.. అయితే రాయ్ ను చేరదీసిన పృధ్వీరాజ్ తనయుడు దేవరాజ్.. రాయ్ మీద పగపెంచుకుని ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటుంటాడు.. ఈ నేపథ్యంలో ఓ పనిమీద ముంబై వచ్చిన రాయ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అదే సమయంలో రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్ పేలిపోతుంది. రాయ్ వారసుడిగా.. తన కొడుకైనా విశ్వఖ్ మాఫీయా సామ్రాజ్యానికి బాస్ అవుతాడు. మరోవైపు ముంబైలో రెండు వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది..ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి అండర్ కవర్ కాప్ గా అశోక్ చక్రవర్తి వస్తాడు..క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అమృతా నాయర్ తో కలిసి ఆ కేసును విచారిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. చివరకు అశోక్ ఆ కేసును ఎలా పరిష్కరించాడు.. రాయ్ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అశోక్ అమృతల ప్రేమ ఏమౌతుంది..? చివరకు అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి బాస్ ఎవరు అయ్యారు.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలసిందే.

నటీనటీనటుల విషయానికి వస్తే.. బాహుబలితో తన రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో ఆ తరువాత చెయ్యబోయే సినిమా కోసం చాలా అలోచించి సాహో ని పిక్ చేసాడు ప్రభాస్. బాహుబలితోనే సాహోరే అనిపించుకున్న రెబల్ స్టార్ సాహో కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. మాచో వారియర్ లుక్ నుండి స్టైలిష్ ఫైటర్ లుక్ లోకి మారిన విధానం, దానికి పడిన కష్టం మెచ్చుకోవాల్సిందే. ఓవర్ ఆల్ గా ప్రభాస్ సాహో కి తన తరపున చేయగలిగినంత చేసాడు. ఇక శ్రద్ధ కపూర్ అమృతా నాయర్ పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రలు మాత్రం దక్కలేదు. అయినా స్కోప్ ఉన్నంతలో బాగానే నటించారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఇంత భారీ సినిమాలో సర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్ మాత్రం డైరెక్టర్ సుజీత్. అతని మొదటి సినిమా రన్ రాజా రన్ ని హిట్ గా నిలిపిన ట్విస్టులు జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు సత్తా ఈ సినిమాలో చూపిస్తాడు అనే మాట బాగా వినిపించింది. కానీ సినిమాలో ఆ రేంజ్ స్టోరీ కానీ, ఊహలకు అందకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంటర్వెల్ లో ఉన్న ట్విస్ట్ పర్లేదు అనిపించి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం డల్ గా సాగింది. అస్తవ్యస్తమయిన స్క్రీన్ ప్లే తో అసలు సినిమాలో ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. ఫస్ట్ హాఫ్ ఎదో ఉంది అనిపించిన సుజీత్ సెకండ్ హాఫ్ లో ఏం లేదు అని క్లారిటీ ఇచ్చేసాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించగలిగినంత సాదాసీదాగా ఉంది. కానీ దుబాయ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఉన్నంతలో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అంటే కెన్నీ బీట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే. ఇక లాస్ట్ మినిట్ లో సినిమాలోకి ఎంటర్ అయినా గిబ్రాన్ తన టాలెంట్ ని పూర్తిగా ఈ సినిమాలోకి ట్రాన్స్ ఫామ్ చేసాడు. ఇంత పెద్ద సినిమాకి కావాల్సిన, ఉండాల్సిన వైబ్రేటింగ్ ఆర్.ఆర్ ని అందించాడు. కానీ పాటలు మాత్రం సూపర్ అని చెప్పుకునేలా లేవు. రెండు పాటలు మాత్రం విజువల్స్ పరంగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ లో లేపెయ్యడానికి చాలా వేస్ట్ కంటెంట్ ఉంది. UV క్రియేషన్స్ నిర్మాణవిలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఓవర్ ఆల్ గా సినిమా గురించి చెప్పాలంటే… ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో, పాన్ ఇండియా ఇమేజ్ తో, ప్రభాస్ రేంజ్ ని తెలిపే సినిమాగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సుజీత్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్ల చాలా సఫర్ అయ్యింది. ఒక్క సినిమా అనుభవం ఉన్న కుర్రాడు అన్న భయం నిజం అవడంతో క్లయిమాక్స్ కి చేరడానికి ఆపసోపాలు పడింది. ఇది కేక అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా పెద్దగా లేవు. మరి ఇన్ని అడ్డకుంలు దాటుకుని కేవలం ముందు నుండి నమ్ముకున్న హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సాహో ఎంతవరకు రాబడుతుంది? ఏ రేంజ్ సినిమాగా మిగులుతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.

Share.