ఆ ఏడు పెద్ద నిర్మాణ సంస్థలు బ్యాన్ చేయడంతోనే..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ కలచి వేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో సుశాంత్ మరణం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతులేని ప్రతిభ ఉన్నా పరిశ్రమలో పెద్దలుగా చలామణీ అవుతన్న వారి చేత అణచివేతకు గురికావడంతోనే అతను ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు, బాలీవుడ్‌లో బంధుప్రీతి చాలా ఎక్కువ, కొత్త వారిని తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సుశాంత్‌ను కొన్ని బాలీవుడ్ అతిపెద్ద నిర్మాణ సంస్థలు కలిసి కట్టుగా బ్యాన్ చేశాయని తెలుస్తోంది.

ధర్మ ప్రొడక్షన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్, సాజిద్ నడియాడ్ వాలా, టి-సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, దినేష్ విజన్, బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్‌ను పక్కన పెట్టేయడమే కాకుండా అతనికి వచ్చిన అవకాశాలను కూడా దూరం చేశాయట. దీంతో అతను టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడని 2020 ఫిబ్రవరి 27న చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ‘‘నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు, నా సినిమాలు ప్రేక్షకులు చూసి ఆదరించకపోతే, నా సినిమాలు ఆడకపోతే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు’’ అంటూ సుశాంత్ ఆవేదనతో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.

Share.