ఇదీ…. బోయపాటి కమర్షియల్ స్టామినా.

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టామినా ఎంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల ముందు ఏ అంచనాలనైతే క్రియేట్ చేసిందో ఆ అంచనాల్ని రీచ్ అవ్వనుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది. పండగ వాతావరణం చల్లబడినప్పటికీ… ఈ సినిమా కలెక్షన్ల వేడి మాత్రం తగ్గలేదు. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రతో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ బోయపాటి… ఘానాపాటి అనిపించాడు. విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ చూశారు. ఇక ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లనున్నారు. నిర్మాతలకు ముందుగానే లాభాల్ని తెచ్చిపెట్టి తన కమర్షియల్ స్టామినా రుచి చూపించాడు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ సైతం లాభాల బాటలోకి పయనిస్తుండడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ కలెక్షన్స్ సునామీతో బోయపాటి స్టామినా ఏంటో మరోసారి రుజువైందని చెప్పొచ్చు.

రాంచరణ్, కైరా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీగా నిర్మించారు. ఈ సినిమాలోని యాక్షన్ ప్యాక్ డ్ ఎమోషనల్ సీన్స్ కి జనాలు నిరాజనాలు పట్టారు. బోయపాటి స్టామినాకు తగ్గట్టుగా రాంచరణ్ పెర్ ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి రేసులో ముందంజలో దూసుకెళ్తూ…. బోయపాటి సినిమా అంటే అటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు ఖాయమని వినయ విధేయ రామ మరోసారి రుజువు చేసింది.

Share.