ఎన్టీఆర్ చేతుల మీదగా మత్తు వదలరా


భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకుని వెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్ద కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తున్న సరికొత్త సినిమా మత్తు వదలరా. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా కొత్త నటీనటులతో కొత్త దర్శకుడు రితేష్‌ రానా దర్శకత్వంతో తెరకెక్కుతుంది.

ఈ సినిమా టైటిల్‌ను ‘మత్తు వదలరా’ను ఇటీవల చిత్రయూనిట్ విడుదల చేయగా ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో సీనియర్ నటుడు ఎన్టీఆర్, మరోవైపు టీవీలో మెగాస్టార్ చిరంజీవి కనిపించగా సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. అలారంపై ‘మత్తు వదలరా’ అని చిత్ర టైటిల్‌ని రూపొందించారు. ఫ్లాట్‌ నంబరు 401, కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌.. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అనే సూక్తితో పోస్టర్‌ను ఇంట్రస్టింగ్‌గా క్రియేట్ చేశారు.

కీర‌వాణి చిన్న కొడుకు సింహా కోడూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించగా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా సినిమా రూపొందుతుంది. యూత్ ఎదుర్కొంటున్న ఓ చిత్రమైన సమస్యను సినిమాలో ప్రస్తావించనున్నట్లు చిత్రయూనిట్ చెబుతుంది. యూత్ టార్గెట్‌గా సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Share.