ట్రూజెట్ విస్తరణకు 49 శాతం విదేశీ నిధులు

35

 

జాతీయ స్థాయిలో ఉడాన్ తో పాటు వాణిజ్య పరమైన ప్రయాణ సౌకర్యాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ట్రూజెట్ విమానయాన సంస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్.డి.ఐ 49 శాతం నిధులు సమీకరిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఇంట్రప్స్ (INTERUPS – INC) సంస్థ ఈ నిధులను తన వంతుగా పెట్టుబడిగా సమకూర్చనుంది. దేశంలో ఇప్పటికే 7 విమానాల ద్వారా మొత్తం 21 నగరాలు, ద్వితీయశ్రేణి పట్టణాలకు విమానాయాన సేవలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ట్రూజెట్ దేశ వ్యాప్తంగా తన సేవలను మరింత విస్తరించడం కోసం ఈ నిధులతో ప్రణాళికను రూపొదిందిం కార్యక్రమాలను విస్తరించనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన ఇంట్రప్స్ (INTERUPS – INC) సంస్థ రూ. 49 శాతం నిధులను వాటాగా పెడుతుందని ఎంఈఐల్ గ్రూప్ డైరెక్టర్ కె. వి. ప్రదీప్, అమెరికాకు చెందిన ఇంట్రప్స్ (INTERUPS – INC) సంస్థ న్యూయార్క్ ప్రతినిధి పాలెపు లక్ష్మీ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఎంత మొత్తం నిధులు వాటాగా సమకూర్చాలి లాంటి విషయాలు తదుపరి ఖరారు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదాన్ పథకం తోలి దశలో 21 రూట్లను పొందిన ట్రూజెట్ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విమాన సర్వీసెస్ను ప్రారంభించింది. సర్వీసెస్ ప్రారంభించిన నగరాల్లో హైదరాబాద్ నుంచి ముంబై , ఔరంగాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి అహ్మదాబాద్ నుంచి గుజరాత్లోని పోరుబందర్, రాజస్థాన్లోని జైసల్మేర్, మహారాష్ట్రలోని నాసిక్, జగావ్లతో పాటు గౌహతి నుంచి ఈశాన్య ప్రాంతాలైన కుఛ్బిబెహర్, బురన్పూర్, తేజు, తేజ్పూర్ తో పాటు తమిళనాడు రాజధాని చెన్నై, కర్నాటక లోని బెల్గావి, బీదర్, మైసూర్, విద్యానగర్ తదితర మార్గాల్లో ట్రూజెట్ తన సేవలను విజయవంతంగా నడిపిస్తోంది. హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీస్ నడుపుతున్న సంస్థ ట్రూజెట్ ఒక్కటే.
ఇప్పటి వరకు 28 లక్షలకు పైగా మంది ప్రయాణం
సంస్థని స్థాపించిన అనతికాలంలోనే 28,19,893 ప్రయాణికులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానాలు నడపడం ద్వారా దేశ విమానయాన చిత్రపటంలోకి వాటిని ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. 2015 జూలై 12న రెండు విమానాలతో ప్రారంభమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రూజెట్ సంస్థ ఇప్పటి వరకు 28,19,893 ప్రయాణికులను వివిధ మార్గాల్లో తీసుకెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here