టెన్షన్.. టెన్షన్..: అయోధ్య కేసులో తీర్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

అయోధ్య కేసు.. సుప్రీం కోర్టులో రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసు. దేశంలోని కోట్లాది మంది హిందువులు ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగిసింది. ఈ క్రమంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతుంది.

దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు పంపుతుంది. ముఖ్యంగా సున్నితమైన భావాలు ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు పంపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు కూడా ఇప్పటికే 4వేల మంది పారామిలిటరీ దళాలను తరలించింది కేంద్ర హోంశాఖ. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం.

1992 డిసెంబర్ 6న హిందువులు కొందరు ఉత్తరప్రదేశ్‌‍లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టింది. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు. ఇక్కడ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారంటూ హిందువులు బాబ్రీ మసీదు కూలగొట్టారు. దీంతో దేశంలో మత కల్లోలాలు చెలరేగగా.. అప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లలో 2వేల మంది చనిపోయారు.

ఈ క్రమంలో ఇరు మతాలవారు కోర్టు మెట్లెక్కగా.. అయోధ్య వ్యవహారం చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 17లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు భావిస్తుంది. సుప్రీం కోర్టు సీజేఐ రంజన్‌ గొగొయి పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన వెళ్లే లోపు అయోధ్య తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

Share.