బింబిసార’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విషాదం.. అభిమాని అనుమానాస్పద మృతి

27

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎప్పటిలానే తారక్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. చివరిగా ఎప్పటిలానే అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. వర్షాకాలం వచ్చింది. భారీవర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కంగారుపడకండి.. జాగ్రత్తగా.. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి.. మీ కోసం మీ భార్య, పిల్లాపాపలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. దయచేసి జాగ్రత్తగా వెళ్లండి.. అంటూ అభిమానులను రిక్వస్ట్ చేశారు తారక్. ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికి విషాదం ఈవెంట్ లో చోటు చేసుకుంది. నందమూరి అభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు.
శిల్పకళావేదికలో బింబిసార మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. అభిమాన నాటులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను చూసేందుకు ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన సాయిరాం ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈవెంట్ ప్రారంభం నుంచి ఉత్సాహంగా.. కేకలు వేశాడు, చిందులువేశాడు. అభిమాన నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూసి ఆనందించాడు. ఈవెంట్‌ ఆఖరులో వర్షాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన జాగ్రత్తలనూ విన్నాడు. ఈవెంట్‌ ముగిసింది. తారలంతా ఒక్కొక్కరుగా ఇంటికివెళ్లారు. అదేసమయంలో సడెన్‌గా సాయిరాం శవమై తేలాడు. అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు.. పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు సాయిరాం ఎలా చనిపోయాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. తొక్కిసలాట లో మరణించాడా..? లేదా ఏదైనా అనారోగ్య పరమైన సమస్య కారణంగా మృతి చెందాడా..? అభిమానుల మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here