భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా…

_ సరిహద్దుల్లో చిహ్నాల ఏర్పాటు… సరికొత్తగా కుట్రలు…

జిత్తులమారి చైనా తీరు చూస్తుంటే… కావాలనే యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది.

ఎట్టిపరిస్థితుల్లో భారత్ భూభాగమైన లడక్ మొత్తాన్నీ ఆక్రమించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. 

ఇటీవల… లడక్ లోని వివాదాస్పద భూమిపై చైనా… తన మ్యాప్ సింబల్ వెయ్యడమే కాదు… తాజాగా ప్యాంగాంగ్‌లో… వాస్తవాధీన రేఖ దగ్గర ఫింగర్-4, ఫింగర్ 5 ప్రాంతంలో… తన దేశ మ్యాప్‌ను ముద్రలా ఏర్పాటుచేసింది.

ఇది ఎంత పెద్దదంటే… ఆకాశం నుంచి చూసినా కనిపిస్తోంది. 81 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో…
మాండరిన్ లాంగ్వేజీలో దీన్ని రూపొందించింది.

నిజానికి ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతం మొత్తం చైనాదేమీ కాదు. దీనిపై రెండు దేశాల మధ్య వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.

ఫింగర్ 1 నుంచి ఫింగర్ 4 వరకు ఇండియా, ఫింగర్ 5 నుంచి ఫింగర్ 8 వరకు చైనా సైన్యం ఉంటుంది.

ఫింగర్ 4ని రెండు దేశాల మధ్య సరిహద్దుగా భావిస్తున్నారు. ఐతే… ఈమధ్య చైనా సైన్యం ఫింగర్ 4లోకి చొరబడింది.

అక్కడి నుంచి వెళ్లిపోతామంటూనే వెళ్లకుండా తిష్టవేసింది. ఇప్పుడు అక్కడే తమ దేశ పటాన్ని వేసింది.

తద్వారా… ఫింగర్ 4ను ఆక్రమించేందుకు యత్నిస్తోందనే సంకేతాలు వస్తున్నాయి.

ఫింగర్ అంటే మరేదో కాదు. ప్యాంగాంగ్ సరస్సు దగ్గర కొన్ని పర్వత ప్రాంతాలు… ముళ్లలాగా పైకి మొనదేలి ఉంటాయి.
వాటిని ఫింగర్స్ అంటుంటారు.

చూడటానికి అవి వేళ్లలా కనిపిస్తాయి. ప్రస్తుతం ఫింగర్ ఫోర్ ప్రాంతంలో చైనా… తన సైన్యాన్ని, వాహనాల్నీ ఉంచింది. అక్కడే కొన్ని డేరాలు కూడా వేసుకుంది. తాజాగా తన ముద్ర వేసింది.

ఇక్కడే జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. ప్రస్తుతం చైనా ఇక్కడ 186 గుడారాల్ని ఉంచింది.

ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో… చైనా దాదాపు 8 కిలోమీటర్లు చొరబడిందనే ప్రచారం జరుగుతోంది.

ఫింగర్ 4, ఫింగర్ 5 ప్రాంతంలో చైనా సైన్యం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతూనే… వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతోంది.

ప్రధాని మోదీ మాత్రం… చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి రాలేదనీ… ఎలాంటి ఆక్రమణా జరగలేదని చెబుతున్నారు. వాస్తవం ఏంటనేది ఆర్మీకే తెలియాలి.

Share.