కేంద్ర ప్రభుత్వం పై కాగ్ ఆగ్రహం..

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్పుపట్టింది. దళాలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పార్లమెంటులో(parliament) కాగ్ తన నివేదికను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రశ్నలు సంధించింది.

లడఖ్, సియాచిన్ లాంటి ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న దళాలకు స్నో గాగుల్స్(snow goggles), మల్టిపర్పస్ బూట్లు(multipurpose boots), దుస్తులు(clothing), ఎక్విప్ మెంట్ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కాగ్ అడిగింది. అలాగే ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సీటీ(indian national defence university) నెలకొల్పడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నెలకొల్పాలని కార్గిల్(kargigl) రివ్యూ కమిటీ 1999లో రికమండ్ చేసింది.

లడఖ్, సియాచిన్ ఎత్తైన పర్వత ప్రదేశాలు. అక్కడ విధులు నిర్వహించడం అంత ఈజీ కాదు. ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. ప్రకృతి విపత్తులు ఎదుర్కోవాలి. వెన్నులో వణుకు పుట్టించే చలిని తట్టుకోవాలి. రక్తం గడ్డ కడుతుంది. ఇలాంటి చోట విధులు చేసే సైనిక దళాలకు ప్రత్యేక దుస్తులు, ఎక్విప్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న సౌకర్యాలు సరిపోవడం లేదు. మరింత మెరుగైన వసతులు కల్పించాల్సి ఉంది. అందులో భాగంగానే మల్టి పర్పస్ బూట్లు ఇవ్వాలి. ఈ బూట్ల ద్వారా -55 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో సైతం పాదాలను రక్షించుకోవచ్చు. అయితే మల్టి పర్పస్ బూట్ల విషయంలో బాగా కొరత ఉంది. అలాగే 750 స్నో గాగుల్స్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు.

Share.