నేత్రావతి నదిలో లభించిన సిద్దార్థ మృతదేహం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కెఫే కాఫీ డే అధినేత, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మృతదేహం నేత్రావతి నదిలో లభించింది. సోమవారం సాయంత్రం నేత్రావతి నది బ్రిడ్జి మీదకు డ్రైవర్‌తో కలిసి వెళ్లిన సిద్ధార్థ.. తరువాత కాసేపటికి కనిపించకుండా పోయారు.

దీంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావించిన పోలీసులు.. రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను చేపట్టారు. 36గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు మంగుళూరు పోలీసు అధికారులు. అయితే బుధవారం ఉదయం(31 జులై 2019) స్థానిక మత్స్యకారులు మృతదేహంను కనుగొన్నారు.

అయితే ఆత్మహత్యకు ముందు ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్‌ వేధించారంటూ సిద్ధార్థ తన ఉద్యోగులకు లేఖ రాశారు. కెఫే కాఫీ డే ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా 1750 కెఫేలు ఉండగా.. మలేసియా, నేపాల్, ఈజిఫ్టులో కూడా అవుట్ లెట్లు ఉన్నాయి.

Share.