ఇసుక తవ్వకాలు, పంపిణీపై సీఎం జగన్ సమీక్ష


ఏపీలో ఇసుక కొరతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అమరావతిలో బుధవారం (అక్టోబర్ 30, 2019) ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పండ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లు వేస్తున్నారని చెప్పారు. గతంలో వ్యవస్థ అంతా అవినీతిమయం అయ్యిందని విమర్శించారు. కుడి, ఎడమ లేకుండా ఇసుకను దోచేశారు..దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామన్నారు. ఇసుక వ్యవహారంలో జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది. కొందరు భవన నిర్మాణ కార్మికులు ఇదివరకే ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిపక్షాలు, మిగతా రాజకీయ పార్టీలు దీనిపై ఆందోళన చేస్తుండటంతో సీఎం జగన్ ఇసుక పాలసీని సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారులతో రివ్యూ చేశారు. మూడు రోజుల్లో వరదల కారణంగా ఇసుకను సకాలంలో అందించలేకపోయామని తెలిపారు. ఇసుక నిల్వలకు అవకాశమున్న కాలువలు, నదులు నుంచి ఇసుకను తీస్తున్నామని చెప్పారు.

టీడీపీ రాబందుల్లాగా మీద పడి ఆరోపణ చేస్తుందని.. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి సీరియస్ గా తీసుకుని వారం రోజులు ఇసుక మీదనే దృష్టి పెట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

Share.