మంత్రులకు ఆదేశాలు: బోటు ప్రమాదం ఘటనపై జగన్ సీరియస్

తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ బోటుకు పర్యాటక అనుమతి లేదని అధికారులు నిర్ధారించారు. NDRF బృందాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

అయితే..బోటు ఎక్కడున్నది మాత్రం తెలియరావడం లేదు. రెండంతస్తులున్న బోటు పక్కకు ఒరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కింద ఎసీ, పైనా నాన్ ఎసీ సౌకర్యం ఉందని సమాచారం. బోల్తా కొట్టడంతో పైన ఉన్న వారు..బోటుపైకి ఎక్కినట్లు వెల్లడించారు. దీంతో ఏసీలో ఉన్న వారు అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం వారికి తెలియకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం బోటులో 71 మంది ఉన్నారు. బోటు ఆచూకి తెలిస్తే..మృతదేహాలు బయటపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే..సాయంత్రం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.

బోటు మునక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బోటులో 29 మంది తెలంగాణ వాసులున్నారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా బోటుకు ఎలా అనుమతినిచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. యజమానుల ధనదాహం పర్యాటకుల ప్రాణాలకు మీదకు తెచ్చింది. 71మంది కేవలం 24 మంది బయటపడడం..మిగతా వారి పరిస్థితి ఏంటో ఆందోళన నెలకొంది. వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీసిన జగన్.. వెంటనే బోటు సర్వీసులను ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న మంత్రులు వెళ్లాలని ఆదేశించారు. డ్రైవర్లకు నైపుణ్యం ఉందా? లేదా? అని చూడాలి అని చెప్పారు. అలాగే బోట్లలో అన్నీ ఏర్పాట్లు ఉన్నాయా? లేదా పరిశీలించాలని అన్నారు. సహాయ చర్యల్లో హెలికాప్టర్లను వాడాలని ఆదేశించిన జగన్.. తక్షణమే బోటు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించారు. నిపుణులతో మర్గదర్శకాలు తయారు చేయించాలని అప్పటివరకు బోటు ఆఫీసులు మూసివేయాలని నిర్ణయించారు.

సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఘటనపై సమాచారం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతుండగా బోటుకు అనుమతులు లేనట్లుగా అధికారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61మంది ఉండగా.. వారిలో 27మంది బయటపడగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది.

Share.