దేశంలో 24 గంటల్లో 34,884 కేసులు.. 671 మరణాలు

దేశంలో 24 గంటల్లో 34,884 కేసులు.. 671 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది.

కొత్త కేసుల సంఖ్య రోజురోజుకీ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,884 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 10,38,716కు చేరింది.

వీరిలో 35,8692 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 6,53,750 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 

నిన్నటి పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గడం గమనార్హం. 

కొత్తగా మరో 671 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 26,273కు పెరిగింది.

ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,61,024 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,34,33,742 నమూనాల్ని పరీక్షించారు.

Share.