మే16తర్వాత భారత్ లో ఒక్క కరోనా కేసు కూడా ఉండదు: స్టడీ

గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నీతి అయోగ్ సభ్యుడు మెడికల్ మేనేజ్‌మెంట్‌పై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపి కీలక విషయాలు చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి నియంత్రించగలిగామని లేదంటే రెట్టింపుగా ఉండేదని అన్నారు. 10రోజుల్లో నమోదైన కేసులు కేవలం 5రోజుల్లోనే చూడాల్సి వచ్చేదని.. కొద్ది రోజులుగా చూస్తుంటే కేసుల నమోదు తగ్గుతూ వస్తుంది.

దీనిని బట్టి చూస్తుంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే అవకాశాలు లేనట్లు కనిపిస్తుందన్నారు. మే 3తర్వాత ఇండియాలో కేసుల తీవ్రత పెరిగి మే12నాటికి పూర్తిగా పడిపోతుందని మే16కు సున్నాగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శనివారం నుంచి మే మొదటి వారం వరకూ నమోదయ్యే కేసులు 35వేలకు దాటవని ఈ సందర్భంగా చెప్పారు.

గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లో కేసులు నమోదు పెరుగుతుంటే ఈ స్టడీ నిజం కాదనిపిస్తోందని కమిటీ సభ్యల్లో ఒకరన్నారు. ‘ఈ స్టడీని పక్కకుబెట్టి చూస్తుంటే కేసులు తగ్గుతాయనడంలో ఎలాంటి సాక్ష్యాలు లేవు. మీ ముందుచూపును నేను నమ్మలేను. వెంటిలేటర్లు, బెడ్స్, ఐసీయూ సౌకర్యాలను పెంచాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ కథనం ప్రచురించి. ఏప్రిల్ లో కరోనాను ఎలా ట్రీట్ చేశారో అనేదే దాని సారాంశం. మార్చి 31నాటికి 2.1మిలియన్ RNA టెస్టు కిట్లు, ఇన్ఫెక్షన్ ను డిటెక్ట్ చేసే కిట్లు. సిద్ధంగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లోనూ పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించగలం. ఏప్రిల్ నాటికి మిలియన్ కిట్లు వస్తాయని అంచనా వేస్తే అంతకంటే రెట్టింపుగానే అందాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఇప్పటికీ 5.4మిలియన్ మంది శాంపుల్స్ పరీక్షించింది. రాబోయే నెలల్లోనూ టెస్టింగులు ఇలాగే జరగనున్నాయి. మరిన్ని కేసులు నమోదైనా ట్రీట్ మెంట్ అందించేందుకు సిద్ధంగానే ఉంది ఇండియా. ICMR ఆధ్వర్యంలో 200 ల్యాబ్‌లు ఉండగా రోజుకు 40వేల శాంపుల్స్ పరీక్షిస్తున్నారు.

వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో నమోదయ్యే కరోనా కేసులకు వెంటనే టెస్టు ఫలితాలు అందుతున్నాయి. ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తిని అడ్డుకోగలం. నియంత్రించగలమని స్టడీ చెప్తోంది.

Share.