శుభవార్త చెప్పిన ఆక్స్‌ఫర్డ్‌

కరోనా మహమ్మారితో ప్రపంచ మొత్తం చిగురుటాకులో వణుకుతోంది. మహమ్మారిని తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. అమెరికా, రష్యా, ఇండియా, చైనా సహా పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం అవి మొదటి దశను పూర్తి చేసుకొని రెండో దశ హ్యుమన్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మానవులపై ప్రయోగించగా ప్రోత్సాహక ఫలితాలు కనిపించాయని, ‘సురక్షితమైన, ఇమ్యూనోజెనిక్’లా ఉందని ‘ది లాన్సేట్’ అధ్యయనం తెలిపింది. ట్రయల్స్‌లో పాల్గొన్న 1,077 మంది పాల్గొన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వగా కరోనా వైరస్‌తో పోరాడగల యాంటీబాడీలు, తెల్ల రక్తకణాలు తయారయ్యేందుకు దారి తీసిందని తెలిపింది.

తాము అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌ వలంటీర్‌ శరీరంలో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని, ఇది సురక్షితమైందని పెడ్రో ఫోలెగాట్టి, కేటియెట్ ఈవర్ నేతృత్వంలోని పరిశోధకులు అధ్యయనంలో పేర్కొన్నారు. ‘ChAdOx1 nCoV-19తో పెద్దగా సైడ్‌ ఎఫెక్ట్‌ ఏం లేవని, స్వల్పంగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. కాగా, మానవులపై సంభావ్య కొవిడ్‌-19 క్లినికల్‌ ట్రయల్స్‌ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ChAdOx1 nCoV-19గా పిలుస్తున్నారు. హానిలేని చింపాంజీ వైరస్ నుంచి తయారు చేయబడింది. మానవ వ్యాక్సిన్ ట్రయల్‌ను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్నర్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని యూనివర్సిటీ ధ్రువీకరించింది.

Share.