ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు డబుల్ ఫైన్

ట్రాఫిక్ ఫైన్స్ పై దేశవ్యాప్తంగా నిరనసనలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. మరో సంచలన నిర్ణయం వెలువడింది. దీనిపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందించటం విశేషం. ఇంతకీ విశేషం ఏంటంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వేసే చలానాను రెట్టింపు కానుంది. ఈ ఆదేశాలను జారీ చేసింది ఎవరో తెలుసా ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్.

సామాన్యులు తప్పుచేస్తే వేలకు వేలు జరిమానాలు వేస్తున్నారు.. ట్యాక్స్ లు కట్టే వాళ్లే ఇలా ఉంటే.. పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకెంత వేయాలి అనే ప్రశ్న వచ్చింది. నెటిజన్లు భారీ ఎత్తున దీనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ జాయింట్ కమిషనర్ మీనూ చౌదరి తీవ్రంగా పరిగణించారు. అలాంటి వారికి రెట్టింపు చలానా విధించాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆదేశాలను సెప్టెంబర్ 4వ తేదీనే ఆయా శాఖలకు వెళ్లిపోయాయి కూడా.

సిగ్నల్స్ జంప్ చేసినా, సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా, హెల్మెట్ లేకపోయినా ఏ విధమైన ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు కమిషనర్ మీనూ చౌదరి. రెండు సార్లు చలాన్లు విధించిన తర్వాత.. వాటికి చెల్లించకపోతే వెంటనే కోర్టుకు పంపించాలని కూడా ఆదేశించారాయన. 2018లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన 250 మంది పోలీసులపై కేసులు నమోదు అయినట్లు వివరించారాయన. 2019లో ఇప్పటి వరకు 100కి పైనా కేసులు పోలీసులపై ఉన్నాయన్నారు. పోలీసులు హద్దు దాటకుండా.. ఇప్పటికే 626 మంది పోలీసులకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందని.. ఆ కెమెరాల ముందే చలాన్లు రాస్తున్నట్లు ప్రకటించారాయన.

Share.