ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

14

ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ స్టేను కొట్టేసిన డివిజన్ బెంచ్ ఎన్నికలు జరుపుకోవచ్చునని స్పష్టంచేసింది.
హైకోర్టు తీర్పుతో రేపు అనగా.. ఏప్రిల్ 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన హైకోర్టు..ఫలితాలను మాత్రం ప్రకటించకూడదని ఆదేశాలు జారీచేసింది
తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఫలితాలు వెల్లడించవద్దని తీర్పు ఇచ్చింది డివిజన్ బెంచ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here