జాగ్రత్త పడండి : బ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు నెల రెండో వారంలో ఈ హాలీడేస్ వచ్చాయి. ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం 3 రోజులు మాత్రమే పని చేయనున్నాయి. ఆగస్టు 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ సెలవు. దీంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఆగస్ట్ 12న బక్రీద్ తర్వాత రెండు రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు సెలవు.

బ్యాంకు వరుస సెలవుల దృష్ట్యా ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలు కూడా పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలపై సందేహాలు ఉన్నాయి. బ్యాంకులతో పాటు ఏటీఎంలలో కూడా నగదు లేక మూతపడే అవకాశం లేకపోలేదంటున్నారు.

దీంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పేలా లేవు. మరి బ్యాంకులు ఏ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయో చూడాలి. ప్రజలు ముందే నగదు విషయంలో జాగ్రత్త పడటం మంచిది. ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిదంటున్నారు.

Share.