అతను రాజకీయాలకు అర్హుడు: పవన్ కళ్యాణ్ పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు


మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో చేశారు. ఈ క్రమంలో సైరా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా అమితాబ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమితాబ్ బచ్చన్. రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు. “నేను చేసిన తప్పు చేయద్దని చెప్పాను. అని కానీ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాడు. అతను నా సలహాలను వినలేదని నవ్వుతూ అన్నారు. అయితే ఇప్పుడు దాని నుండి బయటకు వచ్చాడు” లేండి అన్నారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లకు కూడా ఇదే సలహా ఇచ్చానని, రజిని కూడా నా మాట వినలేదని అన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాన్ రాజకీయాలు మాత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయని అమితాబ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై చాలా ఇష్టం ఉందని, అతను ఏదైనా సాధించగలడు అన్నట్లుగా అమితాబ్ చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు అని అన్నారు. అమితాబ్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానమో ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు వెల్లడించారు. మీకు పవన్ కళ్యాణ్ ఎలాగో నాకు బచ్చన్ అంటే అలాగా అంటూ బహిరంగంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ముందు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో కూడా ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి అమితాబ్ బచ్చన్ మాత్రమే.

Share.