హ్యాట్సాఫ్ ఇడ్లీ అవ్వ: ఒక్క రూపాయికే కడుపు నింపుతుంది

సాధారణంగా ఇడ్లీ మనం ఏదైనా హోటల్ కు వెళ్లి ఇడ్లీ తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తక్కువలో తక్కువగా ఓ ఇడ్లీకి ఎంత తీసుకుంటారు? మినిమం రూ.10 కొన్ని స్టార్ హోటళ్లలో అయితే రూ.50 వరకు కూడా ఉంటుంది. ఏవో ప్రభుత్వాలు పెట్టే భోజన పథకాలు తప్పించి ఎక్కడ కూడా అంతకు తక్కువగా దొరకవు కానీ, ఓ 80ఏళ్ల అవ్వ మాత్రం ఒక్క రూపాయికే ఇడ్లీ పెడుతూ అందరి కడుపు నింపుతుంది. ఇప్పుడు ఆ ఇడ్లీ అవ్వే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

వ్యాపారంలో లాభాలు చూసుకుని భారీగా రేట్లు పెంచేసుకుని వ్యాపారులు అమ్ముకుంటున్నా రోజుల్లో.. లెక్కలు వేసుకోకుండా ఆకలి లెక్కలు మాత్రమే తీరుస్తున్న ఈ అవ్వ పేరు కె.కమలతాల్. తమిళనాడులోని వడివేలంపాల్యంకు చెందిన ఈ అవ్వ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. అక్కడ రెండు, మూడు ఇడ్లీలు తింటే కడుపు నిండిపోతుంది.

అయితే ఆ ఇడ్లీ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం ఒక్క రూపాయి మాత్రమే. మూప్పై ఏళ్ల నుంచి ఇడ్లీ అమ్ముతున్న అవ్వ కొంతకాలం నుంచి ఒక్క రూపాయికి అమ్ముతుంది. ఇంతకుముందు అయితే 50పైసలకే ఇచ్చేది అంట. అవ్వ ఉండేది ఓ పూరింట్లో.. పేదరికంలోనే అయినా కూడా అక్కడ ఉండే పేదవాళ్ల ఆకలి తీర్చేందుకే ఇలా తక్కువ రేటుకే అమ్ముతుందట.

పేదరికం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో రూ.15 నుంచి రూ.20 పెట్టి తినేవాళ్లు కూడా తక్కువగా ఉంటారట. అందకే వారికోసమే ఇలా తక్కువ ధరకు ఇడ్లీ అమ్ముతున్నట్లు అవ్వ చెబుతుంది. ఈ క్రమంలోనే అవ్వకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవ్వకు హాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

Share.