ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్

కరోనావైరస్ (COVID-19) వైట్ హౌజ్‌కు వ్యాపించింది. ఇవాంక ట్రంప్ పీఏ(పర్సనల్ అసిస్టెంట్)కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్న ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారేద్ కుష్నర్ లకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. యూఎస్‌లో ఇప్పటికీ 76వేల మృతులు నమోదైనట్లు సమచారం.

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కొవిడ్-19 పాజిటివ్ గా కన్ఫార్మ్ అయిన తర్వాత ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్ కు టెస్టులు నిర్వహించారు. కొద్ది రోజుల ముందు ట్రంప్ కు సన్నిహితంగా పనిచేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

వైట్ హౌజ్ మెడికల్ యూనిట్ కు సమాచారం అందించి.. వైట్ హౌజ్ క్యాంపస్ లో పనిచేసే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్లు తెలిపాం. అని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా ట్రంప్ స్టాఫ్ అందరికీ కరోనా టెస్టుులు నిర్వహిస్తున్నారు.

Share.