జయరామ్ కేసు : ఇట్స్ ప్రీ ప్లాన్డ్ మర్డర్

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్‌ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకుని హత్య చేశారని నిర్దారించారు. నిందితుడు రాకేష్ రెడ్డి.. జయరామ్‌ను మభ్యపెట్టి పిలిపించాడని, బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. హత్య చేయడమే లక్ష్యంగా దాడి జరిగిందన్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు విశాల్, నగేష్ ప్రధాన పాత్రధారులు అని చెప్పారు. ఈ కేసులో పోలీసుల పాత్రపైనా విచారిస్తున్నామన్నారు. రాకేష్‌తో సంబంధాలున్న ఐదుగురు పోలీసులకు నోటీసులు ఇస్తామన్నారు. రాకేష్ స్నేహితుడు సుభాష్ చంద్రరెడ్డి నుంచి మర్డర్ కు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మర్డర్ చేస్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలను రాకేష్ రెడ్డి.. సుభాష్ కి పంపాడని చెప్పారు..

జయరామ్ మర్డర్‌తో శ్రిఖా చౌదరికి సంబంధం లేదని రాకేష్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చాడని డీసీపీ తెలిపారు. దొంగతనం, అక్రమ చొరబాటు, డాక్యుమెంట్లు ఎత్తికెళ్లిన సెక్షన్ల కింద శ్రిఖాపై కేసు నమోదు చేశామన్నారు. మరోసారి శ్రిఖాని విచారిస్తామన్నారు. జయరామ్‌ను మర్డర్ చేశాక నిందితులు వీడియో తీశారని, ఆ వీడియోలు పోలీసులుకు చిక్కినట్టు సమాచారం. ఆ వీడియోల్లో మర్డర్‌కు సంబంధించి కీలక సమాచారం ఉందని తెలుస్తోంది.

Share.