టీడీపీ అధినేత చంద్రబాబుపైనా జేసీ సంచలన వ్యాఖ్యలు

రాజధాని రైతులపై కక్ష సాధించడం ఏంటి?
రాజధాని రైతులకు సంఘిభావం తెలిపారు. ప్రతీ చోటా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే.. ఆయన్ను ముక్కలుగా చేసేయాలని.. కానీ రాజధాని రైతులపై కక్ష సాధించడం ఏంటని విరుచుకుపడ్డారు.

సీఎం పీఠం కోసం ఎదురుచూసిన జగన్‌… ఇప్పడు కక్ష సాధిస్తున్నాడు
సీఎం పీఠం కోసం ఎదురుచూసిన జగన్‌… ఇప్పడు కక్ష సాధిస్తున్నాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ.. సామాజికవర్గపై కక్ష కోణంలోనే ఉన్నాయి జేసీ విశ్లేషించారు. మీ‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడు.. మీకు జరిగిన నష్టంతో పోలిస్తే నాకు జరిగింది చిన్నదని అమరావతి రైతులతో వ్యాఖ్యానించారు. తనకు 124 బస్సులు ఉంటే 84 బస్సులు మూసేశాడని ఆరోపించారు. అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో చంద్రబాబుకు భూములున్నది వాస్తవమే..
చంద్రబాబుకు అమరావతిలో భూములు లేవనడం పూర్తిగా అబద్ధమన్నారు. చంద్రబాబు కమ్మవారికి ఏదో మేలు చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. చంద్రబాబు కమ్మ జాతిని పూర్తిగా నాశనం చేశారని… కృష్ణా గోదావరిలో కలిపేశారని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు.

సొంత పార్టీ అధినేతనే ఇరుకునపెట్టిన జేసీ
త్రిశూల్ సిమెంట్స్ లీజు ఉత్తర్వులు వచ్చినప్పటి నుండి జేసీ దివాకర్‌రెడ్డి ఆవేశంగా ఉన్నారు. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే అమరావతిలో చంద్రబాబుకు భూములున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసి… టీడీపీలోనూ కలకలం సృష్టించారాయన. సొంత పార్టీ అధినేతనే ఇరుకునపెట్టేశారు.

Share.