తమిళనాడులో విషాదం : అత్తివరదరాజస్వామి ఆలయంలో తొక్కిసలాట, నలుగురు భక్తులు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు చనిపోయారు. మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఉన్నారు. ఆమెని నారాయణమ్మగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు తమిళనాడుకి చెందిన భక్తులు ఉన్నారు.

అనూహ్యంగా తొక్కిసలాట జరగడంతో కొందరు భక్తులు సృహ కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తొక్కిసలాటలో సొమ్మసిల్లి పడిపోయిన మరో ఐదుగురు భక్తులు కాంచీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో వంద మందిపైగా గాయపడినట్లు సమాచారం.

Share.