సంకీర్ణం సమాప్తం : కర్ణాటక సీఎం రాజీనామా!

కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామాకు రెడీ అయ్యారు. రెబల్ ఎమ్మెల్యేల బుజ్జగింపు ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో చేసేది లేక కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. కుమారస్వామి సాయంత్రం 7గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. ఇవాళ(జులై-22,2019) అసెంబ్లీలో బలపరీక్షపై ఓటింగ్ జరగనున్న సందర్భంగా తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు విశ్వాస పరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్ జేడీఎస్ నాయకులు స్పీకర్ ని కోరినప్పటికీ ఇవాళే విశ్వాస పరీక్ష చేపట్టనున్నట్లు స్పీకర్ కేఆర్ రమేష్ సృష్టం చేసిన విషయం తెలిసిందే. 15మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 210 కాగా మ్యాజిక్ పిగర్ 106గా ఉంది. బీజేపీకి 107మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి 102 సభ్యలు మద్దతు మాత్రమే ఉంది. దీంతో విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరిగితే సంకీర్ణ సర్కార్ పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది

Share.