తిరుపతి లడ్డూలో కేరళ జీడిపప్పు!

తిరుపతి..అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామి వారు..తర్వాత లడ్డూ. అవును ఇక్కడి లడ్డూకు ఎంతో పేరు ఉంది. ఇక్కడి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత వేరు. వెంకన్న లడ్డూ గురించి బహుశా తెలియని వారుండరు. అమోఘమైన ఈ లడ్డూ పేరు వింటే చాలు నోట్లో నోళ్లు ఊరుతాయి. ఈ లడ్డూలో ఎన్నో పదార్థాలను కలుపుతుంటారు అధికారులు. అందులో ప్రధాన మైంది జీడిపప్పు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. అక్కడి జీడిపప్పు నాణ్యంగా ఉంటుందని..దీని వాడకంతో లడ్డూ ప్రసాదానికి మరింత రుచి వస్తుందని టీటీడీ భావిస్తోంది.

కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. టిటిడి నిత్యం 4 లక్షల పైచిలుకు లడ్డూలను తయారు చేస్తోంది. ఇందుకు నిత్యం 2 వేల 840 కిలోల జీడిపప్పు వినియోగమౌతోంది. స్వామి వారి విషయాలతో పాటు భక్తుల అన్న ప్రసాదాల తయారీలో వాడే సరుకులను టీటీడీ ఈ టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది.

టీటీడీ ప్రస్తుతం జీడిపప్పును రెండు నెలలకొకసారి టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీతో ఎస్ గ్రేడ్ రకానికి చెందిన 170 టన్నుల పప్పు కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం త్వరలోనే ముగియనుంది. కొత్త కాంట్రాక్టు కోసం దేవస్థానం మార్కెటింగ్ విభాగం..KSCDCని సంప్రదించింది. ధర..నాణ్యత..సరఫరా..ఇతరత్రా విషయాల్లో ఇరువర్గాలకు అవగాహన కుదిరింది.

Share.