కాళేశ్వరంలో కీలక ఘట్టం – మురిసిన మల్లన్న సాగర్

అబ్బుర పరిచే రీతిలో రూపుదిద్దుకున్న పుంపుహౌసులు .. వేల క్యూసెక్కుల నీటిని పంప్చేసే మిషన్లు.. వందల కిలోమీటర్ల మేర కాల్వలు.. సుదీర్ఘమైన సొరంగాల ద్వారా పరుగులు తీస్తోంది గోదారమ్మ. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మింస్తోంది మేఘా ఇంజనీరింగ్. అతి తక్కువ కాలంలో కనివినీ ఎరుగని ఇంజనీరింగ్ అద్భుతాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేసింది ఎంఈఐఎల్. ఈ ప్రాజెక్ట్‌లోని ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ ప్రభుత్వ సహకారంతో నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. ఇప్పటికే లింక్-1 లోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, లింక్-2లో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌ను పూర్తిచేసిన ఎంఈఐఎల్ తాజాగా ప్యాకేజ్- 12లో భాగంగా మల్లన్నసాగర్ పంప్‌హౌస్‌ను శరవేగంగా పూర్తిచేసింది. ఏప్రిల్ 25 న సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన రంగనాయకసాగర్ పంప్‌హౌస్‌లోని రెండు మిషిన్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్  పంప్‌హౌస్‌లోకి చేరిన నీటిని అధికారులు మంగళవారం నాడు మొదటి పంప్‌ను స్విచ్ ఆన్ చేయడంతో ఇక్కడి నుండి గోదావరి జలాలు కొండపోచమ్మకు తరళివెళ్లాయి.

కాళేశ్వరంలో భాగంగా మానవ నిర్మితమైన అతిపెద్ద 52 టిఎంసిల సామర్థ్యంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మ్లన్న సాగర్ ఆయువుపట్టు లాంటిది. మల్లన్నసాగర్ పంప్‌హౌస్‌లో మొత్తం 8 మెషిన్లను ఏర్పాటు wచేశారు. ఒక్కోక్క మిషన్ సామర్థ్యం  43 మెగావాట్లు. మొత్తం 8 పంపులకు 344 మెగావాట్ల విద్యుత్ అవసరం.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంఈఐఎల్ భారీ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేనటువంటి, ఏ ప్రాజెక్ట్ కాళేశ్వరం విద్యుత్ వ్యవస్థకు దరిదాపుల్లో కూడా లేదు అంటే అర్థం చేసుకోవచ్చు మేఘా ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎంత పెద్ద విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసిందో. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 7200 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 2 టిఎంసీ ల నీటిని పంప్చేయడానికి 4992 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇందులో 3767 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ నిర్మించింది. ఇందులో 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లు, దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ ల్కెన్లను ఎంఈఐఎల్ పూర్తి చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్స్టేషన్లు, లైన్లను ఎంఈఐఎల్ ఇప్పటికే పూర్తి చేసింది.

కాళేశ్వరంలో భాగంగా భూగర్భంలో అతిపెద్ద పంప్‌హౌస్ నిర్మించిన మేఘా ఇందులో ఒక్కొక్క మెషిన్ సామర్థ్యం 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 భారీ మోటార్లను ఏర్పాటు చేసింది. ఈ భారీ మోటార్లకు విద్యుత్ అందించేందుకు 400/138/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మేఘా ఏర్పాటు చేసింది. అలాగే సరస్వతి పంప్‌హౌస్‌లో 480 మెగావాట్ల కలిగిన అన్నారం పంప్‌హౌస్‌లోని 12 మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీ అన్నారం సబ్‌స్టేషన్‌ను,  పార్వతి పంప్‌హౌస్‌లో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటార్లకు విద్యుత్ అవసరం కోసం 400/220/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మేఘా ఏర్పాటు చేసింది.

దాదాపు కొన్ని వందల కిలోమీటర్లకుపైగా గోదావరి ఏడాదిపాటు జలసిరులతో కళకళలాడుతుంది. ప్రపంచ చరిత్రలోనే ఎవరూ వినియోగించని అతి పెద్ద మేఘా మోటర్లతో కొనసాగుతున్న ఎత్తిపోతలతో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. బీడుబారిన తెలంగాణ భూములను తడపడంలో మేఘా తన ప్రత్యేకతను అద్భుత పంపింగ్ ద్వారా చాటుకుంటోంది.

Share.