కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ క్లియర్ చేయించిన ముఖ్యమంత్రి


సీఎంలు వెళ్తుంటే ఆ దారిలో వెళ్లే అన్నీ వాహనాలను పూర్తిగా నిలిపివేస్తారు పోలీసులు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లిన తర్వాతే ఎవరి వాహనాలకు అయినా దారి ఇస్తారు. ఇది ఎప్పుడూ జరిగే అసలు ప్రాసెస్. అయితే దేశంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఇటువంటి ప్రోటోకాల్‌ల విషయంలో కాస్త డిఫరెంట్‌గా ప్రవిర్తిస్తూ ఉంటారు.

మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఆమె తీసుకునే నిర్ణయాలు సంచలనంగా మారుతుంటాయి. లేటెస్ట్‌గా అటువంటి నిర్ణయమే ఒకటి తీసుకుని మమతా బెనర్జీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోయిందనే కారణంతో తన కాన్వాయ్‌ని ఆపేసి సాధారణ వాహనాలకు దారి ఇచ్చి అవి వెళ్లేవరకు ఆగి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆగస్ట్ 8న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా కోల్‌కత్తాలోని వీఐపీ రోడ్డులో తెఘోరియా క్రాసింగ్‌లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి ఉంది.

తను వెళ్లే దారిలో ట్రాఫిక్ అలా ఉండటం గమనించిన మమతా వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపి, అక్కడి ట్రాఫిక్ పోలీసులను పిలిచి సాధారణ ప్రజలకి ఇబ్బంది లేకుండా చెయ్యమని ఆదేశించింది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఆమె కాన్వాయ్‌లో ముందుకు సాగింది. ఇందుకోసం ఆమె ఐదు నిమిషాల పాటు రోడ్డుపైనే కారులో కూర్చుని ఉన్నారు.

Share.