మేఘా లో ఐటీ తనిఖీలు- వాస్తవాలు

MEIL కంపెనీలో ఎలాంటి ఐటీ సోదాలు కానీ,దాడులు కానీ జరగలేదు.రొటీన్ గా ప్రతి రెండేళ్లకి ఓ సారి జరిగే Inspection లో భాగంగానే ఈరోజు మేఘా కార్యాలయానికి ఐటి అధికారులు వెళ్లారు . గత 20 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకోసారి ఆ కంపెనీ కార్పోరేట్ ఆఫీస్ లో జరుగుతున్న రొటీన్ ప్రొసీజరే ఇది. ఐటి అధికారుల Inspection కూడా కేవలం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో జరిగిందే తప్ప మిగిలిన 17 రీజనల్ ఆఫీస్ లలో ఎక్కడ కూడా జరగడం లేదు.
హైదరాబాద్ లోని మేఘా ఆఫీస్ కి కొన్ని క్లారిఫికేషన్ లో భాగంగా ఐటి సిబ్బంది వెళ్లారు. పూర్తిగా ఇది మేఘా ఆఫీస్ అంతర్గత కార్యకలాపాలకు సంబంధించిన అంశమని ఐటీ అధికారులే చెప్పారు. Advance Taxes కట్టే ప్రతి కార్పోరేట్ కంపెనీ లో జరిగే ప్రొసీజరే ఈ రోజు మేఘా కార్యాలయం లో కూడా ఐటీ శాఖ చేపట్టింది తప్ప దీనికంత ప్రాముఖ్యం లేదని అధికారులే తెలిపారు‌ .

Share.