వేట : వైల్డ్ అడ్వంచర్ షోలో మోడీ

డిస్కవరీ ఛానల్ అనగానే.. జంతువులు, పక్షులు, ప్రకృతి ఉంటాయి. వాటిని చూపించే అడ్వంచర్స్ కనిపిస్తారు. దట్టమైన అడవిలో నెలల తరబడి తిరుగుతూ వీరు షూట్ చేస్తారు. అందుకే ఈ షోలకు అంత క్రేజ్. డిస్కవరీలో వచ్చే

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ అంటే చాలు ఓ ఆసక్తి.. ఉత్కంఠ ఉంటుంది. అడ్వంచర్ షోలలో ఇది నెంబర్ వన్. మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో అడవుల్లోకి వెళ్లి జంతువులు, భయంకరమైన పాములు, అరుదైన జాతుల మనుగడ.. వాటి జీవనశైలి వంటి ఆసక్తికర అంశాలను వివరిస్తుంది ఈ షో. ఇలాంటి షోలో ఫస్ట్ టైం భారతదేశం నుంచి ప్రధానమంత్రి మోడీ కనిపిస్తుండటం విశేషం.

ఈ షోను బ్రిటీష్ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌ చేస్తారు. ఈసారి మన ప్రధాని మోడీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి మోడీ అడవుల్లో పర్యటిస్తారు. జంతువులను దగ్గర నుంచి చూడనున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి వ్యవహరించాలి.. వాటిని ఎలా షూట్ చేస్తారు.. ఏయే జంతువులు ఎంత ప్రమోదకరంగా ఉంటాయనే విషయాలను మోడీ స్వయంగా తెలుసుకోనున్నారు. ఛానల్ ప్రోమో రిలీజ్ చేసింది.

ప్రొమోలో మోడీ.. ఫుల్ హ్యాండ్ టీం షర్ట్ తోపాటు.. జాకెట్ వేసుకుని ఉన్నారు. రెయిన్ కోట్ కూడా ధరించారు. చేతిలో ఈటె పట్టుకుని.. వేటకు రెడీ అన్నట్లు ఉంది ఓ ఫొటో. మరో ఫొటోలో మాత్రం నది ఒడ్డున టీ తాగుతున్నట్లు ఉంది. గతంలో ఒబామా కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇండియా నుంచి ప్రధానమంత్రి హోదాలో మోడీ ఒక్కరే ఈ షోకు వెళ్లటం విశేషం. ఆగస్ట్ 12వ తేదీ రాత్రి 9 గంటలకు మోడీ పాల్గొన్న షో ప్రసారం కానుంది.

Share.