స్వయంవద.. సందేశం ఇస్తుంది

112

చారిత్రక నేపథ్యంలో ఇటీవల వచ్చిన భాగమతి చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనరే అయినా… కాస్త చరిత్రను జోడించి కథను ఆసక్తికరంగా మలచడంతో ఆ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇలాంటి చారిత్రక నేపథ్యంతోనే… కాస్త హారర్ సస్పెన్స్ ను జోడించి ‘స్వయంవద’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వివేక్ వర్మ. మరి ఈ చిత్రం ఏమాత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించిందో చూద్దాం పదండి.

కథ: స్వయంవద(అవికారావు) ఓ పెంకి పిల్ల. తన మాటే నెగ్గాలని… ప్రతి ఒక్కరూ తన మాటే వినాలనే మనస్తత్వం తనది. అంతేకాదు తన ముందు ఎవరైనా వెకిలి వేషాలు వేసినా… కోపం తెప్పించే పనులు చేసినా.. ఏమత్రం సహించదు. అలాంటి వాళ్లకు స్పాట్లోనే తగిన శాస్తి చేసేస్తుంది. అంతటి గడుసరి పిల్ల స్వయంవద. తండ్రి విక్రమ్ రెడ్డి(లోహిత్ కుమార్) కూడా తన కూతురి మాటలకు ఎదురు చెప్పకుండా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ఇతనికి బినామీగా జెల్లా వెంకట్రాముడు(పోసాని)వ్యవహరిస్తుంటాడు. ఇతని కుమారుడు సుబ్బు(ఆదిత్య అల్లూరి) సినిమా హీరో అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. సుబ్బు… స్వయంవద ప్రేమించుకుంటారు. ఇరువురి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే.. స్వయంవద యాట్యిట్యూడ్ సుబ్బుకు నచ్చదు. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. దాంతో స్వయంవద ఎలా రియాక్ట్ అయింది? ద్వితీయార్థంలో వచ్చే ప్రియంవద ఎవరు? స్వయంవదకు, ప్రియంవదకు వున్న సంబంధం ఏమిటినేది తెరమీద చూడాల్సిందే.

కథనం విశ్లేషణ: నెగిటివ్ థింకిగ్ మనిషిని ఎలా పతనం చేస్తుందనేదాన్ని దర్శకుడు చక్కటి కథ.. కథనాలతో ఎంతో చక్కగా చూపించారు. తనకు తొలి చిత్రమైనా ఆద్యంత ఆకట్టుకునేలా తెరకెక్కించారు. మొదటి సన్నివేశాన్నే అద్భుతంగా తెరకెక్కించి గగుర్పొడిచేలా చేశాడు. సినిమా చూసిన వాళ్లు ఈ ఫస్ట్ సీన్ మర్చిపోలేరు. హారర్ సప్సెన్స్ అంశాలను వినోదం ఎక్కడా తగ్గకుండా రూపకల్పన చేశారు. ఒక వైపు నవ్విస్తూనే ఆలోచింపజేసేలా మంచి సందేశాన్నిచ్చారు. ఒకానొక చారిత్రక నేపథ్యాన్ని ఇప్పటి వర్తమానానికి ముడివేస్తూ చక్కటి కథను అల్లుకున్నాడు. నెగిటివ్ థింకింక్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పాడు. దర్శకుడిగా స్వయంవద వివేక్ వర్మకు మంచి పేరు తీసుకురావడం ఖాయం. ఇక స్వయంవద పాత్రలో అహంభావిగా అనికారావు సహజంగా నటించింది. భయానక సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రియంవద పాత్రలో పూర్తి భిన్నమైన స్వభావంతో నటించి మెప్పించింది. ఆదిత్య అల్లూరి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. ప్రతికూల ఆలోచనలు గల తండ్రిగా లోహిత్ కుమార్ ఆకట్టుకుంటే… కొడుకు కోసం తపించే తండ్రిగా పోసాని నటన రక్తి కట్టించింది. ఆద్యంతం సాగే మూడు పాత్రల్లో ధన్ రాజ్ తన పూర్తిస్థాయి నటన చూపించారు. వేణు ముర‌ళీధ‌ర్.వి కెమెరా పనితనం సినిమాకు హుందాతనం తీసుకురాగా….ర‌మ‌ణ‌.జీవి పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగా సాగాయి. సెల్వ కుమార్ ఎడిటింగ్ పనితనం కనిపించింది. ఇప్పటి దాకా హారర్ చిత్రాలంటే ఒక ఫామ్ హౌస్, అమ్మాయికి దెయ్యం పట్టడం, నేపథ్యంగా దానికో కారణం ఉండటం ఇవీ ఇప్పటిదాకా మనం చూస్తున్న సగటు తెలుగు, తమిళ హారర్ చిత్రాలు. కానీ స్వయంవద ఇందుకు కొత్తగా సాగుతూ రొటీన్ కు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. చారిత్రక నేపథ్యంతో సాగడం, నెగిటివ్ థింకింగ్ వద్దని చెబుతూ సందేశాత్మకంగా, వినోదాత్మకంగా సరికొత్త చిత్రంగా అలరిస్తుంది. ఈ చిత్రం ఇంతలా ఆకట్టుకుంటుందంటే కారణం దర్శకుడి ప్రతిభే. ఇలాంటి మంచి సినిమా చేసిన వివేక్ వర్మ అభినందనీయుడు.
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here