బాలయ్య వారసుడొస్తున్నాడు – మోక్షజ్ఞ ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్

నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. నందమూరి వంశం మూడోతరం కథానాయకుడిగా ఎప్పుడెప్పుడు తెరంగేట్రం చేస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది కాలంగా మోక్షూ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి.. 2020 ఉగాది నాడు మోక్షూ ఎంట్రీ ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి..

బాలయ్య సొంత బ్యానర్ ఎన్‌బీకే ఫిల్మ్స్ పతాకంపై ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు ఓ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు నందమూరి అభిమానులు..

‘నందమూరి సింహం మోక్షజ్ఞ వస్తున్నాడు.. ఇంక అరుపులే’ అంటూ డిజైన్ చేసిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటన ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు బాలయ్య అభిమానులు.

Share.