బాదుడే బాదుడు: రికార్డ్ స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

41
petrol price hike

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెట్రో బాదుడు తలనొప్పిగా మారబోతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పటికే గరిష్ఠ సాయికి చేరగా.. చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచేశాయి.

లీటర్‌ పెట్రోల్‌, డీజల్‌పై మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్‌ ధర దేశరాజధాని ఢిల్లీలో 85 రూపాయలకు చేరగా.. వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో రూపాయికిపైగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. జనవరి 6వ తేదీ నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ .1.49, రూ .1.51 పెరిగాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి లీటరు రూ .91.80కు చేరుకోగా, డీజిల్ రేటు లీటరు రూ.82.13కు చేరింది.
COVID-19 మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఇంధన ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. తక్కువ ఉత్పత్తి, ఎక్కువ డిమాండ్ కారణంగా సరఫరాలో అసమతుల్యత ఏర్పడిందని అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లుగా ప్రధాన్ వెల్లడించారు.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.20, డీజిల్‌ ధర 75.38
చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 87.85 వద్ద, డీజిల్‌ ధర రూ. 80.67
కోలకతాలో లీటరు పెట్రోలు ధర రూ. 86.63 వద్ద, డీజిల్‌ ధర రూ. 78.97
హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 88.63 వద్ద, డీజిల్‌ ధర రూ. 82.26
అమరావతిలో లీటరు పెట్రోలు ధర 91.43, డీజిల్‌ ధర రూ. 84.58

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here