55 మీటర్ల ఎత్తుకు చేరువలో పోలవరం స్పిల్ వే

10
Polavaram 55 meters spillway works

2019లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం మరియు స్వావలంబన కోసం ‘పోలవరం ప్రాజెక్ట్’ త్వరితగతిన నిర్మించి ఈ రాష్ట్రాన్ని సశ్యస్యామలం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు వెళుతోంది. మేఘా ఇంజినిరింగ్ కి 2019 నవంబర్ లో ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు, అనగా ఒకే ఏడాదిలో మేఘా ఇంజినీరింగం సంస్థ 52 మీటర్ల ఎత్తు వరకు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది. అంతే కాకుండా పూర్తిస్థాయిలో 55 మీటర్ల ఎత్తు వరకు స్పిల్ వే పనులను నిరాటంకంగా కొనసాగిస్తున్నది.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా పక్కా ప్రణాళికలతో స్పిల్ వే పనులు చకాచకా జరుగుతుంటే గత ప్రభుత్వ హాయంలో పిల్లర్లు 28 మీటర్ల ఎత్తు ఉంటే ఇప్పుడు 52 మీటర్ల ఎత్తుకు నిర్మించినా స్పిల్ వే కంటికి కనబడుతుండగా.. ప్రతిపక్షాలు స్పిల్ వే ఎత్తు తగ్గింపు పై గోల చేయడం వెనక మతలబు ఏమిటి..? కట్టిన స్పిల్ వే ని కూలగొట్టమనా లేదా చంద్రబాబు నిర్దేశించిన 47.5 మీటర్ల ఎత్తు వరకు ఉండేలా జేసీబీలతో కూల్చేయాలనా?… రాష్ట్ర రైతాంగాన్ని రావణకాష్టంలో కాల్చేయలనా..?

ఒక పక్క కరోనా మహమ్మారి మరియు వరదలతో ప్రకృతి ప్రకోపించినా కాని పోలవరం లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలనే పట్టుదలతో కరోనా సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకొంటు నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ.. మేఘా చేపట్టిన తరరువాత ఒక ఏడాదిలోనే స్పిల్ వే మరియు స్పిల్ ఛానల్ లో 3.25 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేసింది. ఇందులో స్పిల్ వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన స్పిల్ ఛానల్ లో ఉన్న వరద నీటిని తోడే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ వరద నీటిని తోడి ఈ సీజన్ లోనే మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గ్యాఫ్ – 3 లో మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కొండ రాయి తొలగింపు పనులు, ఇటీవలె వరదలకు పాడైన ఎగువ కాఫర్ డ్యాం మరమ్మత్తు పనులు మరియు గ్యాఫ్ – 1 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.

అతి తక్కువ కాలంలోనే స్పిల్ వే పై 192 గడ్డర్ల నిర్మాణం చేపట్టి వాటిపై పిల్లర్లు అమర్చి, దాదాపు 300 మీటర్ల బ్రిడ్జ్ స్లాబ్ ని మేఘా ఇంజినీరింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించింది. మిగతా గడ్డర్లు, షట్టరింగ్, స్టీల్ పనులు, కాంక్రీట్ పనులు రాత్రింపగళ్లు కొనసాగిస్తూ పోలవరం ప్రాజెక్ట్ ను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని మేఘా సంస్థ పట్టుదలతో ఉంది. పోలవరంకు సంబంధించిన ఒక్కో గేట్ 300 టన్నుల బరువు కలిగి, 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉండే అతి భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఇందుకు గాను కీలకమైన 25 ట్రునీయన్ భీమ్ లను నిర్మించింది. గేట్ల ఏర్పాటుకు కావాల్సిన 98 సిలిండర్లలో 46 సిలిండర్ లు జర్మనీ నుండి ఇప్పటికే పోలవరం చేరుకున్నాయి. మిగతా సిలిండర్ లు త్వరలోనే చేరుకోనున్నాయి. దీనికి తోడు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం చాలా వరకు 55 మీటర్లు పూర్తవడంతో గేట్ల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేస్తోంది.

అవరోధాలు ఎన్ని ఎదురైనా అతి తక్కువ కాలంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ 52 మీటర్ల వరకు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం కావచ్చు, పెద్ద ఎత్తున గడ్డర్లు నిర్మించి బ్రిడ్జ్ స్లాబ్ వేయడం మరియు అతి భారీ గేట్లను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండి పోలవరం రూపురేఖలను మార్చిన మేఘా ఇంజినీరింగ్ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది అనడంలో అతిశయోక్తి లేదు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎత్తు గురించి వాస్తవాలు చెప్పకుండా వక్రీకరణలు మరియు పెద్ద ఎత్తున అబద్ధాలతో ప్రతిపక్షాలు మరియు పచ్చ మీడియా విష ప్రచారం చేయడం రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేయడమే కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అవసరాలను కాలరాయడమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here