‘వెలిగొండ’ మొదటి సొరంగం విజయవంతంగా పూర్తి చేసిన మేఘా

25

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను *మేఘా ఇంజనీరింగ్* విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.

ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం *ఎంఈఐఎల్ సంస్థ* అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. *_ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి_* 9.23 మీటర్లు తవ్వడం ద్వారా ఈ పనులు పూర్తి చేసింది. రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ మొదటి సొరంగం పూర్తి పొడవు 18 కిలోమీటర్లు.

ఒక్కో టన్నెల్ పొడవు 18 కిలోమీటర్లు ఉండగా శ్రీశైలం అభయారణ్య రక్షణ కోసం టిబిఎం – టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగాల తవ్వకం చేపట్టారు. అత్యంత అరుదుగా టిబిఎంను వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్ట్ లోనే వినియోగించారు.

ఇక ప్రాజెక్ట్ కోసం ఆసియాలో పొడవైన కన్వేయర్ బెల్ట్ వినియోగిస్తోంది, 18 కిలోమీటర్లు టన్నెల్ లోకి కన్వేయర్ బెల్ట్ వెళ్లేందుకు రెండుగంటలు పడుతుంది. *టన్నెల్ లో 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలోనూ పనులు చేస్తున్న మేఘా సిబ్బంది*. కరోనా, వర్షాలును సైతం తట్టుకొని మేఘా దాదాపు 10 మీటర్ల చొప్పున తవ్వారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో సొరంగ మార్గం పనులు సైతం ఊపందుకున్నాయి.

ఈ సొరంగం మార్గం ద్వారా 3001 క్యూసెక్స్ (85 క్యూమెక్స్) నీటిని తరలించనున్నారు. దేశంలోని పెద్ద గురుత్వాకర్షణ సొరంగాలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.20 లక్షల ఎకరాల ఆయకట్ కు నీటి సరఫరాతో పాటు 4 లక్షల మంది ప్రజల అవసరాలు తీరనున్నాయి.

  • వెలిగొండ ప్రాజెక్ట్​లోని టన్నెల్​ -1 ను పనులు విజయవంతంగా పూర్తిచేశారు. 7.86 బాహ్యవలయ తవ్వకాలతో ఈ పనులను పూర్తిచేసినట్టు మెయిల్​ సంస్థ అధికారులు తెలిపారు. అయితే టన్నెల్​-1 ను పూర్తిచేసేందుకు హెరెన్​నెక్ట్​ అనే కంపెనీకి చెందిన టీబీఎం మెషిన్​ను ఉపయోగించారు. ఈ సొరంగం ద్వారా 3001 క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ టన్నెల్​ ద్వారా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అంతేకాక 4 లక్షలమందికి తాగునీటి అవసరాలను తీర్చనున్నది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్​ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​లో టన్నెల్​ పాత్ర ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. టీబీఎం యంత్రంతో పాటు, టన్నెల్ -1 పోర్టల్, టన్నెల్ -1 ఎక్స్‌కవేటెడ్ మక్ డిశ్చార్జ్ కూడా ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here