రథ సప్తమి : తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ

రథ సప్తమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఉదయం బ్రాహ్మి ముహుర్తంలోనే ఆదిత్య హృదయం పారాయణ సూర్య నమస్కారాలతో పూజలు మొదలుపెట్టారు.

రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 2020, జనవరి 01వ తేదీ శనివారం సప్త వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవలో పాల్గొన్నారు. 9గంటలకు చిన శేషవాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమంత వాహనసేవ, 2గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం, 4గంటలకు కల్పవృక్ష వాహనసేవ, 6గంటలకు సర్వభూపాల వాహనసేవ, రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

  • భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వాహన సేవల్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో తిరువీధుల్లో మంచినీరు, ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది.
  • శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి ఘనంగా మహా క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. * విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతీ పాల్గొన్నారు. అలాగే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
  • మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి.
  • సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు.
  • ఉదయం నుంచి అస్తమయందాకా తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామి.
  • ఈయనకు నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ ఉన్నారు.
  • అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు ఉన్నారు.
Share.