టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వారు బుధవారం కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌, మరో ఇద్దరు టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) నమోదు చేశాయి.

Share.