ఆర్టీసీ నష్టాలకు మేఘాపై నిందలా.. అసలు నిజాలు ఇవీ..

ఆర్టీసీ నష్టాలకు మేఘాతో లింకా? ఈ తప్పుడు ప్రచారంలో నిజమెంత?

ఒక గొప్ప సంస్కరణ.. కాలుష్యం వెదజల్లే పెట్రో కార్బన్ వాహనాలను నియంత్రించాలని కేంద్రం ముందుకెళ్లింది.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని పట్టుదల ప్రదర్శించింది. కాలుష్యాన్ని వెదజల్లే ప్రభుత్వ సర్వీసులలో ఎలక్ట్రిక్ వాహనాలను మొదట ప్రవేశపెట్టాలని భావించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సూచించింది. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సుల వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిధులు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ టెండరింగ్ విధానాన్ని స్పష్టంగా కేంద్ర నిర్ణయించింది.
బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జారీ చేసిన టెండర్ ఉంది. ఇందుకు సంబంధించి 110 పేజీల ఈ టెండర్ ఆహ్వాన పత్రం లేదా 237 పేజీల ముసాయిదా రాయితీ ఒప్పందాన్ని పరిశీలిస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చిన మేఘా కంపెనీపై చేస్తున్న ఆరోపణలు ఎంత విచిత్రమైనదో అర్థం చేసుకోకతప్పదు. బస్సుల ఎంపిక, ప్రోత్సాహాకాలు, సేకరించే బస్సుల సంఖ్య మొదలైన అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను అమలు చేయాల్సిందే.
ఓలెక్ట్రా బస్సులపై జరుగుతున్న విష ప్రచారం అర్థం లేని అసత్య ఆరోపణలు…
1) అసలు ఓలెక్ట్రా సంస్థ బస్సులను లీజుకు సమకూర్చలేదు. అంతకు ముందు ఉన్న గోల్డ్స్టోన్ (Gold Stone) సంస్థ వాటిని టీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత ఆ సంస్థలోని అత్యధిక వాటాను మేఘా ఇంజనీరింగ్ కొనుగోలు చేసింది. తదనంతరం ఓలెక్ట్రాగా పేరు మారింది. ఇది లిస్టెడ్ సంస్థ. ఇందులో చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు. పూర్తిగా మేఘా సంస్థకు సంబంధించినది కాదు.
2) ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, టెండరింగ్ అంతా కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఓపెన్ ఆన్ లైన్ లో నిర్వహించింది. మరి ఇప్పుడు ఆరోపిస్తున్న వారు ఇంత పారదర్శకంగా ఉన్న ఎందుకు బురద జల్లుతున్నారన్నది స్పష్టం చేయాలి.
3) కేవలం ప్రకృతిపై ప్రేమతో కాలుష్యాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో ఈ ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేశారు. మరి ఈ బస్సుల కుంభకోణంలో మేఘాను అభాసుపాలు చేయడం వెనుకు కుట్రను విష ప్రచారాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి..
తెలంగాణలోనూ పర్యావరణ హితం కోసం ఆర్టీసీ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను కొనకుండా కేవలం 40 బస్సులను అద్దె ప్రాతిపదికన మేఘా సంస్థ భాగస్వామిగా ఉన్న ‘ఓలెక్ట్రా’ బస్సులను అద్దెకు తీసుకుంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?
నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది.

ఇందులో మేఘా కంపెనీ 3500 కోట్లు స్వాహా చేశారంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. తిమ్మిని బమ్మీని చేసి విశ్వసనీయత, విలువలు గల కంపెనీపై బురద జల్లడంలో పనిగా పెట్టుకున్న ఇలాంటి వారి గోబెల్స్ ప్రచారాన్న ఇప్పటికైనా జనాలు నమ్మకపోవడమే మంచిది. వాస్తవాలు తెలుసుకోకుండా బురద జల్లే వారి ఆగడాలు ఎప్పటికీ చెల్లవు. నిజం నిలకడమీద తెలుస్తుంది.

Share.