వీడిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ..పెళ్లిరోజున భర్తకు హ్యాండిచ్చి..

29

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ వీడింది. నీటిలో భర్తతో కలిసి ఆడుకుంటూ కనురెప్పపాటు సమయంలో మిస్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు సాయిప్రియ మిస్టరీని ఛేధించారు. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా ఎన్నెన్నో అనుమానాలు తలెత్తాయి. భర్తతో కలిసి బీచ్ కు వచ్చి ఇద్దరు కలిసి నీటిలో ఆడుకుంటున్న సమయంలో భర్త ఫోన్ కు ఏదో మెసేజ్ వచ్చిందని చూసుకోవటానికి కాస్తంత పక్కకు వెళ్లి క్షణాల్లో వచ్చేంతలోనే సాయిప్రియ కనిపించకుండాపోయింది. దీంతో ఈకేసు పెద్ద మిస్టరీగా మారింది. సాయిప్రియ సముద్రంలోకి జారి గల్లంతు అయ్యిందేమోననే అనుమానంతో పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోమవారం నుంచి గాలిస్తునే ఉన్నారు. కానీ ఎక్కడా సాయిప్రియ ఆచూకీ లభించలేదు.

భర్తను అనుమానించారు పోలీసులు. కానీ సాయిప్రియ భర్త శ్రీనివాస్ మాత్రం తన భార్య సముద్రం నీటిలో గల్లంతా అవ్వలేదని..ఒకవేళ అయి జారితో కేకలు పెట్టేదని..కనీసం నీటిలో ఆమె జారిపోయినా కనీసం ఆమె డ్రెస్ అయినా కనిపించేదనే నమ్మకం మీదనే నిలబడ్డాడు. కానీ పోలీసులు మాత్రం అంత తక్కువ సమయంలో సాయిప్రియ మిస్సింగ్ పట్ల భర్త శ్రీనివాస్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈక్రమంలో ఈరోజుకు మూడు రోజుల నుంచి సాయి ప్రియ కోసం దాదాపు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమై గాలిస్తున్న క్రమంలో సాయి ప్రియ ఆచూకీని కనిపెట్టారు పోలీసులు. సాయిప్రియ సజీవంగానే ఉందని నెల్లూరులో ఉన్నట్లుగా గుర్తించారు. భర్తతో వైజాగ్ ఆర్కే బీచ్ కు వెళ్లిన సాయిప్రియ భర్త కన్ను కప్పి మాయం అయ్యింది. భర్తపై అనుమానాలు కలిగేలా వ్యవహరించింది. ఈ క్రమంలో రవి అనే వ్యక్తితో సాయిప్రియకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా బయటపడింది. భర్తా..తను కలిసి నీటిలో ఆడుకుంటున్న సమయంలో భర్త శ్రీనివాస్ కు ఓ మెసేజ్ వచ్చి కాస్త పక్కకెళ్లాడు చూసుకోవటానికి..ఇంతలోనే సాయిప్రియ తప్పించుకుంది. భర్త ఫోన్ చూస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రియుడితో పరారైంది. అలా పెళ్లి రోజు కదాని భార్య సాయిప్రియతో కలిసి సరదాగా గడుపుదామని వచ్చిన భర్త శ్రీనివాస్ కు ఝలక్ ఇచ్చి క్షణాల్లో ప్రియుడితో మాయం అయినట్లుగా గుర్తించారు పోలీసులు.

సాయిప్రియ, శ్రీనివాస్ దంపతులు. వారి పెళ్లి జరిగి గత సోమవారానికి (జులై 25) సరిగ్గా ఏడాది. పెళ్లి రోజు కావడంతో సాయిప్రియ-శ్రీనివాస్ లు 11 గంటలకు దంపతులు ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటలకు సింహాచలం గుడికి వెళ్లొచ్చారు.మధ్యాహ్నం ఒకటిన్నరకు ఇంటికి చేరుకున్నారు. మళ్లీ సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి బయలుదేరి నాలుగన్నర గంటలకు బీచ్ కు చేరుకున్నారు. 5గంటల 15 నిమిషాల వరకు బీచ్ మెట్లపై కూర్చుని సెల్ఫీలు దిగారు. 5 గంటల 20 నిమిషాలకు బీచ్ లోకి వెళ్లారు. గంటకు పైగా ఇద్దరూ నీటిలో ఇద్దరూ ఆడుకున్నారు. 6.30 గంటలకు తన వస్తువులను భర్తకు ఇచ్చిన సాయిప్రియ ఇంకొంత సముద్రంలోకి వెళ్లింది. 6గంటల 50 నిమిషాలకు శ్రీనివాస్ కు ఓ మేసేజ్ రావడంతో అది చూసి వెనక్కి తిరిగి చూసేలోపే సాయిప్రియ మాయమైంది. అదే విషయాన్ని పోలీసులకు తెలిపాడు భర్త శ్రీనివాస్. చీకటి పడటం, చుట్టూ ఎవరూ చూడకపోవడంతో సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆ మిస్టరీ వెనుక ఆమె ప్రేమ వ్యవహారం బయటపడింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here