శ్రీవారి సేవ‌లో శ‌ర్వానంద్,ర‌ష్మిక‌

శర్వానంద్, రష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని కిషోర్ తిరుమ‌ల తెరకెక్కిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఈ రోజు మ‌ధ్యాహ్నం ఉండ‌నుంది. అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Share.